Breaking News
Home / States / Andhra Pradesh / నెల్లూరులో మరో ‘దిశ’

నెల్లూరులో మరో ‘దిశ’

గూడూరు: ‘దిశ’ ఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో అదే తరహా ఘోరం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని యువతి (30)పై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. గూడూరు మండలం చవటపాళెం ప్రాంతంలో ఉండే యువతికి మతిస్థిమితం లేదు. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె తన తమ్ముడి వద్దే ఉంటోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు సమీపంలోని దుకాణం వద్ద దోశ పిండి తెచ్చేందుకు ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. అలా వెళ్లిన ఆమె ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి ఆమె తమ్ముడు చుట్టుపక్కల వాకబు చేశాడు. రాత్రంతా గాలించినా ఆచూకీ దొరకలేదు. సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ ఇచ్చిన సమాచారం మేరకు దగ్గర్లోని పాడుబడిన ఇంట్లో బాధిత యువతి మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి కొందరు మద్యం మత్తులో అనుమానాస్పదంగా ఈ ప్రాంతంలో తిరిగారని, వారే ఈ ఘోరానికి పాల్పడి ఉంటారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ వెల్లడించారు.

Check Also

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం

Share this on WhatsAppగుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *