Breaking News
Home / Crime / హీరో సుశాంత్ ఫ్యామిలీలో మరో విషాదం..

హీరో సుశాంత్ ఫ్యామిలీలో మరో విషాదం..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో విషాదంలో మునిగిపోయిన అతడి కుటుంబంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. సుశాంత్‌ ఆకస్మిక మృతిని తట్టుకోలేక ఆయన వదిన కన్నుమూసింది. బీహార్‌లోని పూర్ణియాలో ఆమె చనిపోయారు. సోమవారం ముంబైలో సుశాంత్‌ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె బీహార్‌లో తుది శ్వాస విడిచారు. సుశాంత్‌ మరణంచిన విషయాన్ని తట్టుకోలేని ఆమె.. అప్పటి నుంచి ఆహారం తీసుకోవడం మానేసినట్లు తెలుస్తోంది. సుశాంత్ కుటుంబంలో మరొకరు కూడా చనిపోవడంతో… ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యపై పోలీసు విచారణ కొనసాగుతోంది. సుశాంత్‌ మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని.. ఒత్తిడికి అతడు మందులు వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సోమవారం కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సుశాంత్‌ అంత్యక్రియలు జరిగాయి. సుశాంత్ మృతి పట్ల అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Check Also

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్‌

Share this on WhatsAppవిశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎల్జీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *