Breaking News
Home / social media / టిక్‌టాక్ సరదాకు బలైన మరో యువకుడు

టిక్‌టాక్ సరదాకు బలైన మరో యువకుడు

మేడ్చల్ జిల్లా: టిక్‌టాక్ సరదా మరో యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది. సంఘారెడ్డిలో నివసించే నరసింహ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, దూలపల్లి గ్రామంలో ఉండే బంధువుల ఇంటికి వచ్చాడు. దగ్గరలో ఉన్న చెరువుకు వెళ్లాడు. బంధువు ప్రశాంత్ టిక్ టాక్ వీడియో రికార్డు చేస్తుంటే నరసింహ డ్యాన్స్ చేశాడు. అలా రెండు మూడుసార్లు టిక్ టాక్ పాటలు రికార్డు చేసిన తర్వాత మరింత లోతుకు వెళ్లడం కోసం నరసింహ ప్రయత్నించాడు. అక్కడ లోతుగా ఉన్న కుంటలోకి జారిపోయాడు. దీంతో భయపడ్డ ప్రశాంత్ చుట్టుప్రక్కల వాళ్లకు సమాచారం ఇచ్చాడు. కుంట లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో దిగేందుకు స్థానికులు భయపడ్డారు. గురువారం ఉదయం పోలీసులు గజ ఈతగాళ్లను పిలిపించి నరసింహ మృత దేహాన్ని వెలికి తీశారు. టిక్ టాక్‌కు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *