Breaking News
Home / States / ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగుల ఆందోళన…

ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగుల ఆందోళన…

హైదరాబాద్‌: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపో ఎదుట సమ్మెకాలంలో పనిచేసిన తాత్కాలిక డ్రైవర్లు , కండక్టర్లు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, తాత్కాలిక ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పిలుపు మేరకు తాము పనిచేసే ఉద్యోగాలు వదిలిపెట్టి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా 52 రోజులు పనిచేశామని… పర్మినెంట్‌ అయ్యే అవకాశం ఉందని, ఆర్టీసీలో తమకు ఉద్యోగం లభిస్తుందనే ఆశతో పనిచేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటి వరకు తాత్కాలిక ఉద్యోగుల గురించి స్పందించకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *