Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / 20న ఏపీ అసెంబ్లీ ముట్టడి: సీపీఐ

20న ఏపీ అసెంబ్లీ ముట్టడి: సీపీఐ

అమరావతి: రాజధాని అమరావతి జోలికి రావొద్దని సీఎం జగన్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. కాదని వస్తే రాజకీయ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు. రాజధాని మార్పుపై ఉపముఖ్యమంత్రులు, మంత్రులతోనూ సీఎం చర్చించలేదని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో రైతులు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్‌, విజయసాయిరెడ్డి మాత్రమే మాట్లాడుకుని 5కోట్ల మంది తలరాతలు రాస్తున్నారని ఆరోపించారు.

ఈనెల 20న అసెంబ్లీ ముట్టడికి రైతులంతా తరలి రావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. రాజధానిలో 144 సెక్షన్‌ సహా ఆంక్షలతో పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. డీజీపీ మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ శాసనసభలో మంత్రి బుగ్గన పేర్లు చదివారని.. ఇప్పటి వరకు ఒక్క కేసు అయినా నమోదు చేయలేదన్నారు. అమరావతిపై సీఎం జగన్‌ కసి పెంచుకుంటున్నారని రామకృష్ణ విమర్శించారు. రైతుల పోరాటం వృథా కాదని.. అంతిమంగా విజయం దక్కుతుందని చెప్పారు.

Check Also

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం

Share this on WhatsAppగుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *