Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / కీలక పథకాలను ఆమోదించిన ఏపీ కేబినేట్…

కీలక పథకాలను ఆమోదించిన ఏపీ కేబినేట్…

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా అమల్లోకి తేనున్న పలు కీలక పథకాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేటినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతోపాటు గ్రామీణ నియోజవర్గాల్లో అగ్రికల్చర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువులు ల్యాబ్‌లో పరీక్షించి రైతులకు అందజేయాలని కేబినెట్‌ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రెట్టింపు పోషకాహారం అందించే పైలట్‌​ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 77 మండలాల్లో రూ.90 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కేటినెట్‌ నిర్ణయించింది. మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *