Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే…

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే…

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అయింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి.. నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు…
– కేంద్రం నెరవేర్చని హామీలను రాష్ట్రమే చేపట్టాలని..
– రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం
– నెల రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..
– ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రభుత్వ జాయింట్ వెంచర్ దిశగా ప్రయత్నాలు…
– పీపీపీ మోడల్‌లో వైజాగ్‌ మెట్రో చేపట్టాలని నిర్ణయం
– రూ. 8,300 కోట్లతో 42 కిలోమీటర్ల మేర వైజాగ్ మెట్రో
– ప్రపంచంలోనే పీపీపీ మోడల్‌లో నిర్మితమవుతున్న… రెండో అతి పెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టు వైజాగ్ మెట్రో, 4,200 కోట్ల రుణం ఇచ్చేందుకు కొరియా ప్రభుత్వం ముందుకొచ్చింది.
– గాజువాక-కొమ్మాది- 30 కి.మీ, గురుద్వారా- ఓల్డ్ పోస్టాఫీసు-5.25 కి.మీ..
– తాటిచెట్లపాలెం- వాల్తేరు మధ్య 6.5 కి.మీ మెట్రో రైలు
– అన్న క్యాంటీన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు
– గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. కాగా రామాయపట్నం పోర్ట్ ఏర్పాటుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.

Check Also

సీబీఐకి అనుమతి లేదంటే అక్రమార్కులకు కొమ్ముకాస్తునట్టే: రామకృష్ణ

Share this on WhatsAppవిశాఖపట్నం: తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టకూదంటూ ప్రభుత్వం నిర్ణయాన్ని సీపీఐ నేత రామకృష్ణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *