Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రేపు 11 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ…

రేపు 11 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ…

అమరావతి: రేపు ఉదయం 11 గంటలకు ఏపీ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. రేపటి సమావేశానికి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత సచివాలయంలోనే మంత్రివర్గం భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ.. రాజధాని ప్రాంత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తారా? లేదా సచివాలయంలోనే నిర్వహిస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మంత్రివర్గ భేటీలో మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో జీఎన్‌రావు కమిటీ నివేదికపై చర్చించనున్నట్లు సమాచారం. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల సమస్యలపైనా చర్చించే అవకాశముంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *