అమరావతి: ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరికాసేపట్లో అనంతపురం వెళ్లి అక్కడి జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించి ఆ పథకం కింద స్క్రీనింగ్, కంటి అద్దాలను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా వైద్య సేవలు ఉచితంగా అందించనున్నారు. మొత్తం ఆరు దశల్లో, మూడేళ్ల పాటు వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.
