Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నెల రోజుల్లో కొత్త వీసీలను నియమించండి: జగన్ ఆదేశం

నెల రోజుల్లో కొత్త వీసీలను నియమించండి: జగన్ ఆదేశం

అమరావతి: యూనివర్సిటీల వీసీల ఎంపికకు తక్షణమే సెర్చ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. విద్యాశాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పలు సూచనలు చేశారు. 30 రోజుల్లోగా వీసీలను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక విధానంలో వీసీలను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. అర్హత, అనుభవం ఉన్నవారినే వీసీలుగా ఎంపిక చేయాలన్నారు. అలాగే యూనివర్సిటీల్లోని అన్ని ఖాళీలను ఈ ఏడాది చివరి నాటికి భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలనే బలోపేతం చేయాలని తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వాస్తవిక దృక్పథంతో అమలు చేయాలని ఆదేశించారు. లేకపోతే మధ్యతరగతి, పేదపిల్లలు చదువుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌ తరాలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనన్నారు. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. రీయింబర్స్‌మెంట్‌లో ఫీజులు సమయానికి ఇవ్వాలన్నారు. పాఠ్య ప్రణాళికను ఇంప్రూవ్‌ చేయడానికి కమిటీని వేయాలని వెల్లడించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మార్పుచేసిన సిలబస్‌ అమల్లోకి రావాలని కోరారు. అరకులో గిరిజన యూనివర్సిటీ, గిరిజన మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలన్నారు. ఒంగోలు, విజయనగరంలో యూనివర్సిటీలు పెడతామంటూ.. ఎన్నికలకు ముందు హడావిడిగా జీవోలు ఇచ్చారని ఈ సందర్భంగా అధికారులు గుర్తుచేశారు. దీంతో ఆ రెండు యూనివర్సిటీలను కూడా మూడేళ్లలో పూర్తిచేయాలని జగన్ ఆదేశించారు.

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో పనుల పూర్తికి.. అలాగే ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుకు సీఎం జగన్‌ ఆదేశించారు. ట్రిపుల్‌ ఐటీల్లో పరిస్థితులు అన్యాయంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. 50 శాతం మంది విద్యార్థులకే ప్లేస్‌మెంట్‌ ఆమోదయోగ్యం కాదన్నారు. ట్రిపుల్‌ ఐటీల్లో పూర్తిస్థాయిలో పరిస్థితులు మారాలని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని, వేగంగా మార్పులు రావాలన్నారు. ట్రిపుల్‌ ఐటీలకు తాగునీరు కొరత రాకుండా చూడాలన్నారు. రిజర్వాయర్ల నుంచి నేరుగా పైపులైన్‌ ఇవ్వాలన్నారు.

ట్రిపుల్‌ ఐటీల్లో ఆత్మహత్య ఘటనలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్‌లను సందర్శించాలని విద్యాశాఖ మంత్రి, అధికారులకు ఆదేశించారు. స్కూళ్లలో ప్రతి 20–25 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉండేలా చూడాలన్నారు. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నందున టీచర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.

Check Also

ధర్నా చౌక్‌కు చేరుకున్న చంద్రబాబు…

Share this on WhatsAppవిజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఇసుక దీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *