తిరుపతి: నాలుగు నెలల్లోనే 4లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని ఈ ఉద్యోగ నియామకం చరిత్రలో సరికొత్త రికార్డ్ అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా తీసుకుని పని చేయాలని, లంచాలు లేని పారదర్శక పాలన అందించాలన్నారు. వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు అనుసంధానం కావాలని జగన్ సూచించారు.
ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలని, అవినీతి లేని పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగులపై పెడుతున్నామని జగన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్నింటికీ లంచం ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని సూచించారు. 72 గంటల్లో ప్రజల ఫిర్యాదులు పరిష్కరించాలని జగన్ పేర్కొన్నారు.