కృష్ణా జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడ గురువారం కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గన్నవరం మండలం సూరంపల్లిలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భవనాలు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు సదానందగౌడతో కలిసి జగన్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అక్కడే ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
