Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ‘సీపెట్‌’ను ప్రారంభించిన ఏపీ సీఎం….

‘సీపెట్‌’ను ప్రారంభించిన ఏపీ సీఎం….

అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీని (సీపెట్‌) గురువారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడ ప్రారంభించారు. గురువారం ఉదయం 11.00 గంటలకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడతో కలసి సీపెట్‌ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రితో కలిసి ముఖ్యమంత్రి వీక్షించారు. 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.50కోట్లతో సీపెట్‌ భవనాలను నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, సీపెట్‌ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్, కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కె.మాధవీలత, సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఎమ్మెల్యే పార్థసారధి, పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *