Breaking News
Home / National / నేడు ఢిల్లీలో ఏపీ సీఎం రెండోరోజు పర్యటన…

నేడు ఢిల్లీలో ఏపీ సీఎం రెండోరోజు పర్యటన…

ఢిల్లీ: ఢిల్లీలో రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో జగన్ పలువురు కేంద్రమంత్రులను కలువనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్‌షాను జగన్ కలవడానికి ఢిల్లీ వెళ్లారు. అమిత్‌షాను కలిసేందుకు జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసినప్పటికీ అమిత్‌ షా దర్శనం లభించలేదు. అమిత్‌షా అప్పాయింట్‌మెంట్‌ మంగళవారానికి వాయిదా పడిందని ఏపీ భవన్‌ వర్గాలు తెలిపాయి. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో సీఎం భేటీ కానున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *