Breaking News
Home / Film News / మెగాభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

మెగాభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ హిస్టారిక‌ల్ చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుపతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రదర్శన నిమిత్తం అదనపు షోలకు అనుమతిని ఇవ్వాల్సిందిగా నిర్మాత రామ్ చరణ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి అంగీకారం తెలుపుతూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు (7 రోజులు) ఈ సినిమాను ఉదయం గం. 1 నుంచి ఉదయం గం. 10 వరకు అదనపు షోలు ప్రదర్శించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిని జారీ చేసింది. దీంతో మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *