Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నిరుద్యోగులకు ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి పొందుతున్న వారికి ఏపీ సర్కార్ మరో వరం ప్రకటించింది. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. మీడియాతో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి యువ నేస్తం పధకం కింద 4 లక్షలకు పైగా అర్హులకు ప్రతీ నెల రూ.1000 భృతి ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. దాదాపు ఈ పధకానికి 10 లక్షల 74 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. నిరుద్యోగ భృతి తీసుకుంటున్న వారికి ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 555 కేంద్రాల్లో సిల్క్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తామని చెప్పారు. దీని కోసం రూ.24 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ కోసం నిరుద్యోగులు ముఖ్యమంత్రి యువనేస్తం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు ఇష్టం ఉన్న వాటిలోనే కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Check Also

ఏపీలో ఏం పీకుతావ్‌ కేసీఆర్‌.. ఆటో డ్రైవర్‌ వినూత్న నిరసన!

Share this on WhatsAppనెల్లూరులో ఓ ఆటో డ్రైవర్‌ వినూత్న నిరసన నెల్లూరులో అతనో ఆటో డ్రైవర్‌. పేరు పి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *