Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖ ఫార్మాసిటీలో పేలుడుపై ఏపీ మంత్రి ఆరా

విశాఖ ఫార్మాసిటీలో పేలుడుపై ఏపీ మంత్రి ఆరా

విశాఖపట్నం ఫార్మాసిటీలో పేలుడుపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో పేలుడుకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. జిల్లా అధికార యంత్రాంగంతో ఫోన్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. భారీ ఎత్తున మంటలు వ్యాపిస్తున్న తరుణంలో ముందు స్థానిక ప్రజలను, ఫార్మాసిటీ పరిధిలో రాత్రి విధుల్లో ఉన్నవారిని రక్షించడానికి కృషి చేయాలని సూచించారు. ఎవరికీ ప్రాణ నష్టం లేకుండా చూడాలని పోలీసు యంత్రాంగానికి, అగ్నిమాపక అధికారులకు స్పష్టం చేశారు. వైద్య, అగ్నిమాపక, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వెంటనే క్షతగాత్రులకు అవసరమైన తగు వైద్య, సదుపాయాలు సిద్ధం చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి సూచించారు. విశాఖపట్నం పరవాడ లకెలపాలెం దగ్గరున్న రాంకీ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ సీఈటీపీ సాల్వెంట్ లిమిటెడ్ కంపెనీలో ట్యాంకర్ పేలడంతో ఈ మంటలు వచ్చాయి. అవి క్రమంగా పెద్దవి అవుతూ… పేలుడు శబ్దాలు వినిపించాయి.

ఆ శబ్దాలకు స్థానికులు, కంపెనీ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కంపెనీకి చెందిన ఆరుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫార్మాసిటీలో మందులు తయారు చేసేటప్పుడు వృథా ఆయిల్‌ను రీసైక్లింగ్ చేస్తారు. అలా చేస్తున్నప్పుడు… రాత్రి 10కి నైట్ షిఫ్ట్ మొదలైన కాసేపటికే ఇలా జరిగింది. మొన్న రసాయన వాయువులు లీకై ఇద్దరు చనిపోయిన సాయినాథ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీకి దగ్గర్లోనే ఈ సాల్వెంట్ కంపెనీ ఉంది.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *