Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ అవుట్‌ సోర్స్‌ సర్వీసెస్‌ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనున్న జగన్

ఏపీ అవుట్‌ సోర్స్‌ సర్వీసెస్‌ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనున్న జగన్

అమరావతి: ఏపీ అవుట్‌ సోర్స్‌ సర్వీసెస్‌ సంస్థ కార్యకలాపాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల కోసం ఆప్కోస్‌ ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్ సోర్సింగ్‌ సర్వీసెస్‌ సంస్థ ప్రారంభమైంది. 47 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను జగన్ జారీ చేయనున్నారు. సచివాలయంలో 26 శాఖలకు సంబంధించి 643 మంది నియామకం కానున్నారు. విభాగాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలో 10,707 మంది నియామకం కానున్నారు. 13 జిల్లాల కలెక్టరేట్లలో 36,042 మందికి ప్లేస్‌మెంట్ ఇంటిమేషన్‌ లెటర్లు అందించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆప్కోస్‌ ద్వారానే ఉద్యోగుల నియామకం జరగనుంది.

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *