Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అసైన్డ్‌ భూములపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం…

అసైన్డ్‌ భూములపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం…

అమరావతి: సీఆర్డీఏ పరిధిలోని రాజధాని అసైన్డ్‌ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత‍్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసి ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో అసలైన అసైన్డ్‌ దారులకు ప్రభుత్వ నిర్ణయం భారీ ఊరటనిచ్చింది. అసలైన అసైన్డ్‌దారులకు నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ నిర్ణయించింది.

ఫిబ్రవరి 17,2016న జీఓఎంఎస్‌ -41 ప్రకారం ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు రద్దు చేస్తూ… ఏపీ అసైన్డ్‌ ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌)-1977 నాటి చట్టాన్ని ఉల్లంఘించారన్న మంత్రివర్గం..అసలైన అసైన్డ్‌దారులకు రెసిడెన్షియల్, కమర్షియల్‌పాట్లు కేటాయించాలని నిర్ణయించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *