Breaking News
Home / Lifestyle / Business / చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా ఆపిల్ సంస్థ.. చైనాకు మరో షాక్ ఇచ్చింది. మూడు రోజుల్లో ఏకంగా 4,500 చైనీస్ గేమ్స్‌ను తొలగించింది. మొబేల్ గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో ఆపిల్ పలు సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా చైనా గేమ్స్‌ యాప్స్ ను రిమూవ్ చేసింది. లైసెన్స్ నిబంధనల్ని కఠినతరం చేసిన ఆపిల్ సంస్థ అనుమతి లేని యాప్స్ ను తొలగించింది. ఆ యాప్స్‌ను లైసెన్స్ నిబంధనలను తిరిగి పునరుద్ధరించిన తర్వాత అప్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.

ఆపిల్ తీసుకున్న ఈ చర్యలతో చైనా సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా చైనీస్ యాప్ డెవలపర్స్ తమ యాప్స్‌ను యాప్ స్టోర్‌లలో ఉంచడం కోసం చైనీస్ రెగ్యులేటరీ నుండి అధికారిక లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ రాకముందే ప్రాసెస్‌లో ఉండగానే పలు యాప్స్.. స్టోర్స్‌లలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పుడు తాజా నిబంధనల ప్రకారం డెవలపర్స్ లైసెన్స్ పొందిన తర్వాతే యాప్స్‌ను అప్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ విషయాన్ని ఆపిల్ ఎప్పుడో ప్రకటించింది. ఈ నిబంధన జూన్ 30వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని కూడా తెలిపింది. దీంతో వరుసగా గత మూడు రోజుల నుంచి లైసెన్స్ లేని యాప్స్‌ను తొలగిస్తున్నది. జూలై నెలలో రెండు రోజుల్లోనే చైనా యాప్ స్టోర్ నుంచి 3,000కు పైగా యాప్స్‌ను తొలగించారు. ఇప్పటివరకూ మొత్తం 4,500 యాప్స్ రిమూవ్ చేశారు. ఆపిల్ జూలై 1న 1,571 యాప్స్, జూలై 2న 1,805 యాప్స్, జూలై 3న 1,276 యాప్స్‌ను తొలగించింది. ఈ తొలగింపు ప్రక్రియలోభాగంగా దాదాపు 20,000 యాప్స్ ను యాపిల్ తొలగించనున్నది.

Check Also

చైనాకు ‘హీరో సైకిల్స్’ షాక్.. వందల కోట్ల డీల్ రద్దు…?

Share this on WhatsAppగాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్న సందర్భంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *