Breaking News
Home / Health / ఆపిల్స్, గ్రీన్ టీతో గుండె జబ్బులు, క్యాన్సర్ దూరం..!

ఆపిల్స్, గ్రీన్ టీతో గుండె జబ్బులు, క్యాన్సర్ దూరం..!

హెల్త్ & ఫిట్నెస్: ఆపిల్ పండ్లను తినేవారికీ, గ్రీన్ టీని నిత్యం సేవించే వారికీ గుండె జబ్బులు, క్యాన్సర్ రావని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఆపిల్ పండ్లు, గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఆయా జబ్బులు రాకుండా చూస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎడిత్ కొవాన్ యూనివర్సిటీ పరిశోధకులు నిత్యం ఆపిల్ పండ్లను తింటూ, గ్రీన్ టీ తాగే 53వేల మందిపై పరిశోధనలు చేశారు. దీంతో తెలిసిందేమిటంటే ఆపిల్ పండ్లు, గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తాయని నిర్దారించారు. ఈ మేరకు సైంటిస్టులు చేపట్టిన సదరు పరిశోధన తాలూకు వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ అనే ఓ జర్నల్‌లోనూ ప్రచురించారు. నిత్యం 500 మిల్లీగ్రాముల మోతాదులో ఫ్లేవనాయిడ్స్ అందేలా చూసుకుంటే పైన చెప్పిన విధంగా ఆయా జబ్బులు రాకుండా ఉంటాయని ఈ సందర్భంగా సైంటిస్టులు తెలిపారు.

Check Also

కొబ్బరినూనె ఉపయోగాలు

Share this on WhatsApp అమరావతి: జుట్టు పోషణకే కాదు బాడీ లోషన్‌గా, టోనర్‌గా కూడా కొబ్బరి నూనెను వాడొచ్చు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *