Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

ఏలూరు: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకంలో 2019-20 సంవత్సరానికి ఎంపిక చేసిన ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి, ఐదో తరగతిలలో ప్రవేశాలకు నోటిఫి కేషన్‌ జారీ అయ్యింది. అర్హులైన ఎస్సీ బాలబాలికలు ఈనెల 17 నుంచి 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబంలో ఒక విద్యార్థి మాత్రమే అర్హులు. రెసిడెన్షియల్‌ విధానంలో నిర్వహించే ఐదో తరగతిలో 250 సీట్లు, డేస్కాలర్‌ విధానంలో నిర్వహించే ఒకటో తరగతిలో 200 సీట్ల భర్తీ జరుగుతుంది. దరఖాస్తులను https//jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఎలకా్ట్రనిక్‌ లాటరీ పద్ధతి ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఐదో తరగతిలో ప్రవేశాలకు తెలుగు, ఇంగ్లీషు మాధ్యమ విద్యార్థులకు నాల్గవ తరగతి సిలబస్‌ ప్రకారం ఈనెల 29వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. మీ-సేవ ద్వారా ధ్రువీకరించిన ఎస్సీ సర్టిఫికెట్‌, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 65 వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 75 వేలు ఉన్నట్టుగా మీ-సేవ ద్వారా ధ్రువీకరించిన ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్‌, రేషన్‌కార్డులు, ఫొటోతో దరఖాస్తు చేసు కోవాలి. వీటితోపాటు నాల్గవ తరగతి మార్కుల లిస్టు, స్టడీ సర్టిఫికెట్‌ జత చేయాలి. ఒకటో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థి వయస్సు ఐదు నుంచి ఆరు సంవత్సరాల లోపు ఉండాలి. మునిసిపల్‌ కమిషనర్‌/తహసీల్దారు జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాన్ని కూడా దరఖాస్తుకు జత చేయాలి

Check Also

అధికార పార్టీ నేత ” నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.” : మాజీ స్పీకర్

Share this on WhatsAppసత్తెనపల్లి: వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రోద్బలంతోనే తన కుటుంబసభ్యులపై కేసులు బనాయిస్తున్నారని మాజీ స్పీకర్‌ డాక్టర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *