Breaking News
Home / National / ప్రధానికి ఇద్దరు సలహాదారుల నియామకం

ప్రధానికి ఇద్దరు సలహాదారుల నియామకం

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి సలహాదారులుగా ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు నియమితులయ్యారు. భాస్కర్‌ కుల్బే, అమర్‌జీత్ సిన్హాలను నియమించినట్లు ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ (ఏసీసీ) వీరి నియామకానికి ఆమోదం తెలిపింది. వీరికి కార్యదర్శి స్థాయి హోదా, వేతనం అందుతాయి. భాస్కర్‌ కుల్బే, అమర్‌ జీత్‌ సిన్హా ఇద్దరూ 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులే. పశ్చిమబెంగాల్‌ కేడర్‌కు చెందిన కుల్బే గతంలో పీఎంవోలో పనిచేశారు. బిహార్‌ కేడర్‌కు చెందిన సిన్హా రూరల్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీగా గతేడాది పదవీ విరమణ పొందారు. వీరిద్దరూ ఒప్పంద ప్రాతిపదికన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *