గుంటూరు: గ్రామ/వార్డు సచివాలయాల్లో ఆరోగ్య కార్యకర్తల ఉద్యోగానికి మొదటి విడత ఎంపికైన అభ్యర్థినులకు అక్టోబర్ 28వ తేదీ నుంచి నియామక పత్రాలు జారీచేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె.యాస్మిన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో అభ్యర్థినులకు నియామక పత్రాలు జారీచేస్తామని పేర్కొన్నారు. ర్యాంకుల వారీగా నియామక పత్రాలు జారీచేసే షెడ్యూల్ను డీఎంహెచ్వో ప్రకటించారు.
అక్టోబర్ 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఒకటో ర్యాంకు నుంచి 150వ ర్యాంకు అభ్యర్థినులకు పోస్టింగ్ ఆర్డర్స్ అందజేస్తారు. ఉదయం 11గంటల నుంచి 151 నుంచి 325వ ర్యాంకు అభ్యర్థినులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 326 నుంచి 500వ ర్యాంకు అభ్యర్థినులకు, సాయంత్రం 4 గంటల నుంచి 501 నుంచి 700వ ర్యాంకు అభ్యర్థినులకు నియామకపత్రాలు అందజేస్తారు.