Breaking News
Home / Education / మంత్రి ప్రారంభించిన పాఠశాలకు అనుమతుల్లేవ్‌!

మంత్రి ప్రారంభించిన పాఠశాలకు అనుమతుల్లేవ్‌!

ప్రైవేటు స్కూలు యాజమాన్యం నిర్వాకం
ప్రారంభించిన కొద్దిసేపటికే నోటీసులు

ఘట్‌కేసర్‌ రూరల్‌: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ప్రారంభించిన పాఠశాలకు అనుమతులు లేకపోవడం చర్చనీయాంశమైంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం పోచారం పురపాలక సంఘం పరిధి నారపల్లిలో రవీస్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలను హీరో వెంకటేశ్‌, నిర్మాత దిల్‌ రాజుతో కలిసి మంత్రి మల్లారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందించడానికి కార్పొరేట్‌ విద్యాసంస్థలు పాటుపడాలన్నారు. హీరో వెంకటేశ్‌ మాట్లాడుతూ పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికే.. పాఠశాలకు అనుమతి లేదంటూ విద్యాశాఖాధికారులు నోటీసులు అంటించారు. రవీన్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలకు, మండల కేంద్రంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు అనుమతుల్లేవని ఎంఈవో బద్దం నర్సింహారెడ్డి తెలిపారు. నిర్వాహకులకు పలు మార్లు నోటీసులిచ్చినా అనుమతి తీసుకోలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యాలు బదిలీ చేశాయని వివరించారు. మరోసారి నోటీసు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు.

Check Also

కెసిఆర్ కు ఇంగిత జ్ఞానం లేదన్న వీహెచ్‌

Share this on WhatsAppహైదరాబాద్: హాజీపూర్‌ బాధితులను ఇంతవరకు కేసీఆర్‌ పరామర్శించకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు ఆవేదన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *