విజయవాడ: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఏపీలో కూడా మద్దతు లభిస్తోంది. శనివారం తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. సమ్మెకు మద్దతుగా రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నేతలు పలిశెట్టి దామోదరరావు, సుందరయ్య, వరహాలనాయుడు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
