Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీఎస్ఆర్టీసీ సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ మద్దతు…

టీఎస్ఆర్టీసీ సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ మద్దతు…

అమరావతి: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ కొన్ని రోజులుగా టీఎస్ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈ రోజు విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) కన్వీనర్‌ దామోదరరావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 19న ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని తెలిపారు. అదే రోజున తమ జేఏసీ సమావేశమై చర్చించి, తమ భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేస్తుందని చెప్పారు.

టీఎస్ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని, వారు ధైర్యంగా ఉండాలని దామోదరరావు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రవాణా రంగం కార్మికులను అందరిని ఉద్యమానికి సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. టీఎస్ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. వారి సమ్మెకు తాము సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *