Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వారి మెతకవైఖరికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం….

వారి మెతకవైఖరికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం….

అమరావతి: ఏపీయూడబ్ల్యూజే నేత సుబ్బారావు మాట్లాడుతూ టీడీశాట్‌ ఆదేశాలు న్యాయపరంగా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిదే విజయమని, జగన్‌ సర్కార్‌కు పెద్ద దెబ్బ తగిలిందని తెలిపారు. ఛానళ్ల పునరుద్ధరణపై ప్రభుత్వం జాప్యం చేస్తే ప్రజలకు నమ్మకం పోతోందని, కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడటం గర్హనీయమన్నారు. ప్రభుత్వం తన ధోరణి మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, పోలీసుల మెతకవైఖరికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సుబ్బారావు ఆరోపించారు.

తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్టు సత్యనారాయణ ఫిర్యాదుపై చర్యలు తీసుకుని ఉంటే హత్య జరిగేది కాదని అన్నారు. మీడియాను నియంత్రించేందుకు కేబినెట్‌ తీర్మానం సరికాదని తప్పుబట్టారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ధోరణి లేదని సుబ్బారావు విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *