Breaking News
Home / Film News / విడుదలకు సిద్దమైన `అర్జున్ రెడ్డి` రీమేక్…

విడుదలకు సిద్దమైన `అర్జున్ రెడ్డి` రీమేక్…

ఫిల్మ్ న్యూస్: తెలుగులో సంచలన విజయం సాధించిన `అర్జున్ రెడ్డి` బాలీవుడ్‌లోకి `కబీర్ సింగ్` పేరుతో రీమేక్ అయ్యి అక్కడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం తమిళంలోకి `ఆదిత్య వర్మ` పేరుతో రీమేక్ అవుతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. అయితే షూటింగ్ సమయంలో తలెత్తిన వివాదాలు, దర్శకుడి మార్పు కారణంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.

ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాలో నటించడం గురించి ధృవ్ స్పందించాడు. `ఈ సినిమా టీజర్ విడుదలైనపుడు చాలా విమర్శలు వచ్చాయి. నన్ను చాలా మంది తక్కువ చేసి మాట్లాడారు. నా నటనను విమర్శిస్తే ఓకే. కానీ, నా లుక్‌ను కూడా తప్పుపడితే నేను ఏమి చెయ్యాలి. ఈ సినిమా కోసం పొగ, మద్యం తాగాల్సి వచ్చింది. నాకు ఆ రెండు అలవాట్లూ లేవు. ఆ సీన్లలో నటించేటపుడు చాలా కష్టపడ్డా. పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నించా. ఇంట్లో వారితో మాట్లాడడం తగ్గించేశా. కావాలని కోపం తెచ్చుకుని ఇంట్లో వాళ్లపై అరిచేవాడ్ని. గదిలోకి వెళ్లి తాళం వేసుకుని ఒంటరిగా ఉండేవాణ్ని` అని ధృవ్ తెలిపాడు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *