Breaking News
Home / National / రాజ్యసభలో ఆయుధాల సవరణ బిల్లు…!

రాజ్యసభలో ఆయుధాల సవరణ బిల్లు…!

న్యూఢిల్లీ: ఆయుధాల సవరణ బిల్లు-2019ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. సవరణ బిల్లు ప్రకారం చట్ట విరుద్ధంగా ఆయుధాలను తయారు చేసినా, కలిగి ఉన్నాశిక్ష తప్పదు. ఈ మేరకు ఆయుధాల బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది.

సవరణ బిల్లు ప్రకారం ఒక వ్యక్తి రెండు లైసెన్స్‌డ్ ఆయుధాలు మాత్రమే కలిగి ఉండొచ్చు. అక్రమంగా ఆయుధాలు తయారు చేసేవారికి శిక్ష పెరుగుతుందని కూడా అమిత్‌షా తెలిపారు. ‘వ్యక్తిగత భద్రతకు, దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఆయుధాలు, ఆయుధ సామగ్రిని సమర్ధవంతంగా అదుపు చేయాల్సిన అవసరం ఉంది’ అని ఆయన లోక్‌సభలో బిల్లు ప్రవేశపెడుతూ తెలిపారు. అయితే క్రీడాకారులెవరిపైనా ఈ నిబంధన ప్రభావం ఉండదని కూడా హామీ ఇచ్చారు.

బిల్లు ప్రకారం, చట్టవిరుద్ధంగా ఆయుధాలు తయారీ, అమ్మకాలు జరిపితే 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదు పడుతుందని, అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే 7 ఏళ్ల నుంచి 14 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని అమిత్‌షా తెలిపారు. పోలీసు సిబ్బంది నుంచి ఆయుధాలు ఎత్తుకు వెళ్తే జీవిత ఖైదు పడుతుందన్నారు. చట్టవిరుద్ధంగా మారణాయుధాలతో జరిగే నేరాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు 1958లో ప్రవేశపెట్టిన ఆయుధ చట్టానికి ఈ బిల్లు సవరణ తీసుకువస్తోంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *