విశాఖ: ఇండియన్ నేవీ ఆర్మిమెంట్ డిపార్ట్మెంట్ సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన వచ్చింది. యుద్ధ సమయంలో పలు యుద్ధ నౌకలు, వివిధ రకాల గన్స్, బుల్లెట్ ఫ్రూప్ జాకెట్స్, మిషన్ గన్స్.. ఇలా నేవీలో ఉపయోగించే ప్రతి వస్తువును ఎగ్జిబిషన్లో పెట్టారు. ఎన్ఏడీ నేవీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన చూసేందుకు విద్యార్థులు బారులు తీరారు.
