Breaking News
Home / National / పాక్‌కు ఆ హెచ్చరికలు ఇబ్బందికరమే….

పాక్‌కు ఆ హెచ్చరికలు ఇబ్బందికరమే….

న్యూఢిల్లీ: ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మీడియాతో మాట్లాడుతూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) హెచ్చరికలు పాకిస్థాన్‌కు ఇబ్బందికరమేనని వ్యాఖ్యానించారు. ఆ విషయంలో పాక్‌పై తీవ్ర ఒత్తిడి ఉందన్న ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సిందేనని, గ్రే లిస్టులో ఉండటమనేది ఏ దేశానికైనా పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు.

ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టడంలో పాకిస్థాన్ విఫలమవ్వడంతో ఎఫ్ఏటీఎఫ్ 2018లో గ్రే లిస్ట్‌లో చేర్చింది. మనీ లాండరింగ్‌ను అరికట్టడంలో, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటం కోసం కఠిన చట్టాలను అమలు చేయడంలో విఫలమైన దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చుతుందన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు ఫైనాన్షియల్ టాస్క్‌ఫోర్స్ గతంలో 27 పాయింట్లతో కూడిన యాక్షన్ ప్లాన్ సూచించింది. అందులో కేవలం ఐదింటిలో మాత్రమే పాక్ పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో ఇమ్రాన్ సర్కార్‌కు తాజాగా నాలుగు నెలల గడువు ఇచ్చింది. అప్పట్లోగా ఉగ్రవాదంపై సరైన చర్యలు తీసుకోకపోతే బ్లాక్ లిస్టులో ఉంచుతామని శుక్రవారం నాటి ప్రకటనలో హెచ్చరించింది. 2020 ఫిబ్రవరి వరకు సమయమిస్తున్నట్టు పేర్కొంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *