శ్రీకాకుళం : శ్రీకాకుళంలో నవంబరు 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం యానాంకు చెందిన యువత.. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరు కానున్నారు. ఈ మేరకు కలెక్టర్ జె.నివాస్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్మీ నియామక ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతమయ్యేలా కృషి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. రోజుకు కనీసం మూడు వేల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్టుగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి భూపేందర్‌సింగ్ ఎంపికల పక్రియను పర్యవేక్షిస్తున్నారు.
