Breaking News
Home / National / ఐపీఎల్ రెండు నెలలు జరిగేలా ఏర్పాట్లు…

ఐపీఎల్ రెండు నెలలు జరిగేలా ఏర్పాట్లు…

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) సీజన్‌ రెండు నెలల పాటు జరిగేలా బీసీసీఐ ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. సీజన్‌లో రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ను రాత్రి వేళల్లో నిర్వహిస్తారు. ఈ ప్రతిపాదనలను వచ్చే ఐపీఎల్‌ పాలక మండలి సమావేశంలో బీసీసీఐ ప్రవేశపెట్టనుంది. అంతకుముందు వారాంతాల్లో రెండు మ్యాచ్‌లను నిర్వహించేవారు కానీ, వచ్చే సీజన్‌లో ఒకే మ్యాచ్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. గత సీజన్‌ ప్లేఆఫ్స్‌ మ్యాచులను రాత్రి ఏడు గంటలకే నిర్వహించింది. అయితే అన్ని మ్యాచులను రాత్రి ఏడు గంటలకు ప్రారంభించేందుకు జట్ల యాజమాన్యాలు సుముఖంగా లేవు. ఎనిమిది గంటలకు మ్యాచ్‌ను ప్రారంభించినప్పుడు ఎన్నో మ్యాచ్‌లు అర్ధరాత్రి వరకు జరిగాయి. కేకేఆర్×ఆర్‌సీబీ మధ్య జరిగిన ఒక మ్యాచ్‌ ఏకంగా అర్థరాత్రి వరకు జరిగింది. దీంతో స్టేడియానికి వచ్చి చూసే వారికి, టీవీల్లో చూసే అభిమానులకు సౌకర్యంగా ఉండటానికి మ్యాచ్‌ను ముందుగా ఆరంభించాలనే యోచనలో బీసీసీఐ ఉంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *