హైదరాబాద్: జీడిమెట్ల బస్ డిపో ముందు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డితో పాటు ఇతర కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కూకట్పల్లి బస్సు డిపోను ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. హైదరాబాద్ బాలానగర్, సనత్నగర్ పోలీస్ స్టేషన్లో 40 మంది అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎంజీబీఎస్ ముందు ధర్నా చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
