న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ సింగ్ గురువారం అరెస్టయ్యారు. ఆయనతో పాటు మరో ముగ్గురు కవి అరోరా, సునీల్ గోద్వానీ, అనిల్ సక్సేనా లను కూడా ఓ మోసం కేసులో ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు.
రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ఎల్) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. తమ వద్ద రుణాలు తీసుకుని తమ సొంత కంపెనీలో సింగ్ సోదరులు పెట్టుబడులు పెట్టుకున్నారని ఆర్ఎఫ్ఎల్ తన ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. శివిందర్ సింగ్ సోదరుడైన మాల్విందర్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.