తూర్పు గోదావరి: తుని ఆంధ్రజ్యోతి రూరల్ విలేకరి కాతా సత్యనారాయణను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం కోరుకొండ ప్రెస్‌క్లబ్ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. తుని ఆంధ్రజ్యోతి రూరల్ విలేకరి, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కాతా సత్యనారాయణ హత్య దిగ్బ్రాంతికి గురిచేసిందని, ఈ చర్యను ఖండిస్తున్నట్లు కోరుకొండ ప్రెస్‌క్లబ్ పేర్కొంది.
