Breaking News
Home / Crime / వివాహ వేడుకల్లో గాల్లోకి కాల్పులు…ఇద్దరి అరెస్ట్

వివాహ వేడుకల్లో గాల్లోకి కాల్పులు…ఇద్దరి అరెస్ట్

న్యూఢిల్లీ : వివాహ వేడుకల్లో ఇద్దరు యువకులు కంట్రీమేడ్ పిస్టల్ తో కాల్పులు జరిపిన ఘటన దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో వెలుగుచూసింది. న్యూఢిల్లీలోి కర్దంపురి ప్రాంతంలో ఈ నెల 7వతేదీన షోయబ్ మాలిక్ అనే యువకుడి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలకు వచ్చిన సల్మాన్ (21), షావాజ్ మాలిక్(18)లు కంట్రీమేడ్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. వివాహ వేడుకల్లో కాల్పులు జరపడమే కాకుండా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పెళ్లి వేడుకలో కాల్పుల ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన పోలీసులు ఐపీసీ 336, సెక్షన్ 27 ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన నిందితులిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కంట్రోమేడ్ తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ దాచారు అనే విషయమై దర్యాప్తు సాగిస్తున్నారు.

Check Also

విక్రమ్ కోసం కొనసాగుతున్న ‘నాసా’ ప్రయత్నాలు….

Share this on WhatsAppబెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *