Breaking News
Home / States / పిల్లలను అపహరిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

పిల్లలను అపహరిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

హైదరాబాద్: పిల్లల్ని అపహరించి.. డబ్బుల్లేని వారికి పిల్లలను అమ్మడం.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం.. ఇది 9 మంది కలిసి అంతరాష్ట్ర ముఠా చేస్తున్న పని. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను ఎత్తుకు పోతున్న ఈ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు లేని వారితో ఒప్పందం చేసుకుని.. అనంతరం పిల్లల కోసం వేట సాగిస్తారు.

ఒంటరిగా పిల్లలు కనిపిస్తే కిడ్నాప్ చేస్తారు. అనేక మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి తప్పించుకు తిరుగుతున్న అంతరాష్ట్ర ముఠాను చాంద్రాయణ గుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా కిడ్నాప్ చేసి విక్రయించిన ముగ్గురు పిల్లలను పోలీసులు కన్న తల్లిదండ్రులకు అప్పగించారు. ముఠాలోని ఏడుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Check Also

తండ్రి చనిపోయినా మనోధైర్యంతో…

Share this on WhatsAppచదువులో ప్రతిభ చాటిన యువకుడు 2018 సీఏ ఫలితాల్లో 20వ ర్యాంకు ఐసీఎస్‌‌ఐలో ట్యాక్స్‌మాన్స్‌ ప్రైజ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *