చిత్తూరు: ఏపీ సీఎం జగన్ ఈరోజు చిత్తూరు జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ భరత్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం బయల్దేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలో జరిగే వైఎస్సార్ రైతు భరోసా సదస్సులో పాల్గొనడానికి వెళతారు. తర్వాత గన్నవరానికి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారని కలెక్టర్ పేర్కొన్నారు.
