మహాబలిపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై సమీపంలోని పురాతన పట్టణం మహాబలిపురానికి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి తమిళనాడు మంత్రి కె.పాండ్యరాజన్ సాదర స్వాగతం పలికారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సాయంత్రం 4 గంటలకు జరిగే భేటీ నిమిత్తం ప్రధాని మహాబలిపురానికి చేరుకున్నారు. గొప్ప ఆతిధ్య, సాంస్కృతిక నేపథ్యం గల తమిళనాడుకు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మరోవైపు చైనా అధ్యక్షుడి పర్యటనకు వ్యతిరేకంగా టిబెటియన్లు ఆందోళన చేపట్టారు. చెన్నై ఎయిర్పోర్టులో ఐదుగురు టిబెటియన్లను అదేవిధంగా ఐటీసీ గ్రాండ్ హోటల్ వద్ద ధర్నాకు దిగిన మరో 8 మంది టిబెటియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
#WATCH Chennai: Police detained Tibetan activists who were protesting outside the ITC Grand Chola Hotel where Chinese President Xi Jinping will arrive later today. #TamilNadu pic.twitter.com/fgJkQyX0gs
— ANI (@ANI) October 11, 2019