Breaking News
Home / States / అరుణాచల్‌ ప్రదేశ్‌ బృందంతో పోచారం భేటీ….

అరుణాచల్‌ ప్రదేశ్‌ బృందంతో పోచారం భేటీ….

హైదరాబాద్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎస్టేట్స్‌ కమిటీ బృందం శనివారం తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. ఈ సందర్భంగా శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహాచార్యులు ఇతర అధికారులు అరుణాచల్‌ ప్రదేశ్‌ బృందానికి స్వాగతం పలికారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎస్టేట్‌ కమిటీ ఛైర్మన్‌ లైసమ్‌ సిమాయి, ఇతర సభ్యులు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్పీకర్‌ వారికి వివరించి అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ తీరును అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ నిర్వహణలో పాటిస్తున్న విధానాలను కూడా ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం వారికి వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *