Breaking News
Home / National / అంకిత్‌ శర్మ కుటుంబానికి రూ కోటి పరిహారం…..

అంకిత్‌ శర్మ కుటుంబానికి రూ కోటి పరిహారం…..

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లలో మరణించిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఉద్యోగి అంకిత్‌ శర్మ కుటుంబానికి రూ కోటి పరిహారంగా అందచేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఐబీ ఉద్యోగి అంకిత్‌ శర్మ ఈశాన్య ఢిల్లీలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా దుండగులు ఆయనను అమానుషంగా హత్య చేసి మృతదేహాన్ని చాంద్‌బాగ్‌లోని డ్రైనేజ్‌లో పడేసి వెళ్లిన సంగతి తెలిసిందే. శర్మను గంటల తరబడి కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారని పోస్ట్‌మార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *