Breaking News
Home / Film News / ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నా అరవింద్‌…

ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నా అరవింద్‌…

హైదరాబాద్: ‘పవన్‌ కల్యాణ్‌ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించమని మమ్ముట్టిని అడిగా’ అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘మామాంగం’. ఎం.పద్మకుమార్‌ దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా చిత్రంగా నాలుగు భాషల్లో డిసెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీన్ని తెలుగులో గీతా ఆర్ట్స్‌ సంస్థ విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మమ్ముట్టి గురించి మాట్లాడుతూ నిర్మాత అల్లు అరవింద్‌ కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ”స్వాతికిరణం’ కోసం మమ్ముట్టిని తీసుకున్నప్పుడు.. అదేంటి ఓ మలయాళ నటుడిని తీసుకొస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన పాత్ర కనెక్ట్‌ అవుతుందో లేదో అనుకున్నా. నిజానికి అప్పటికి ఆయన అంత పెద్ద నటుడని నాకు తెలియదు. కానీ, ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు కనీసం లేచి నిలబడలేకపోయా. అంత గొప్పగా నటించారాయన. తర్వాత ఓసారి పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ఓ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించా. ఆయనకి ఫోన్‌ చేసి ఇలా ప్రతినాయక పాత్ర ఉంది చేస్తారా అని అడిగా. దానికి ఆయన ‘ఇదే మాట చిరంజీవిని అడుగుతారా’ అని ప్రశ్నించారు. నేను ‘అడగలేను’ అన్నా. దాంతో ఆయన నవ్వుతూ పెట్టేశారు” అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు అరవింద్‌.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *