Breaking News
Home / National / ముంబైలో హాట్ టాఫిక్‌గా మారిన ఆరే కాలనీ….

ముంబైలో హాట్ టాఫిక్‌గా మారిన ఆరే కాలనీ….

ముంబై: మహా నగరం ముంబైలోని ఆరే కాలనీలో ఉన్న సుమారు 2500 భారీ వృక్షాలను నరికివేసేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం రాత్రి కొన్ని చెట్లను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నం చేస్తుండగా ఆ సమయంలో వందలాది మంది కార్యకర్తలు భారీ ప్రదర్శన చేపట్టడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరే కాలనీలో ముంబై మెట్రో కోసం అక్కడో కారు షెడ్డును నిర్మించనున్నారు. దీని కోసం ఆ కాలనీలో ఉన్న భారీ వృక్షాలను తొలగించాలని భావించారు. కోర్టు అనుమతితోనే చెట్ల నరికివేత కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే శుక్రవారం రాత్రి బుల్డోజర్లు రావడంతో కొందరు ఆందోళనకారులు నరికివేతను అడ్డుకన్నారు.

ఆరే కాలనీలో చెట్లను నరికివేయరాదంటూ దాఖలైన నాలుగు పిటీషన్లను ముంబై హైకోర్టు కొట్టిపారేసింది. ఆ తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే చెట్ల తొలగింపు ప్రక్రియ మొదలైంది. వృక్షాలను పెకిలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ కావడంతో ఆరే కాలనీలో భారీ సంఖ్యలో జనం గుమ్ముగూడారు. ఆరే కాలనీలో కారు షెడ్డు కట్టాలని రెండేళ్ల నుంచి ప్రతిపాదన నడుస్తున్నది. అయితే పర్యావరణవేత్తలు అడ్డుతగులుతున్న నేపథ్యంలో చెట్ల నరికివేత ఆలస్యం అవుతోంది. అమితాబ్‌, అక్షయ్ లాంటి బడా హీరోలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు ముంబైలోని ఆరే కాలనీ హాట్ టాఫిక్‌గా మారింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *