విజయవాడ: రైతు భరోసా పథకంలో తన పేరున్నట్లు వచ్చిన వార్తలను పరిశీలించానని మంత్రి సురేష్ తెలిపారు. ఈ విషయాన్ని వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, వారిని వివరణ కోరినట్లు మంత్రి తెలిపారు. అధికారులు సరిగా పరిశీలించకపోవడం వల్లే పొరపాటు జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే జాబితా ప్రకటించాలని అధికారులకు ఆయన సూచించారు. రైతు భరోసా పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. రైతు బిడ్డగా తనకు వ్యవసాయ భూములు ఉన్నాయని మంత్రి సురేష్ వెల్లడించారు.
