Breaking News
Home / Lifestyle / Business / చిన్నవయసులోనే సిఇవో గా..

చిన్నవయసులోనే సిఇవో గా..

భారత వ్యాపారవేత్త దేవితా షరాఫ్‌ వియు టెక్నాలజీ సిఇవో. వియు టెలి విజన్స్‌ను ప్రారంభించిన దేవితా షరాఫ్‌ దాని సిఇవో కూడా ఆమే. వియు 150 మిలియన్ల డాలర్ల రెవిన్యూ ఉన్న ఖరీదైన టెలివిజన్‌ బ్రాండ్‌. ఈ సంస్థను ఆమె 24 ఏళ్ల వయసులో ప్రారం భించారు. దేవితా షరాఫ్‌ వ్యాపారవేత్త మాత్రమే కారు. ఒడిస్సీ డాన్సర్‌. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆన్‌లైన్‌ కాలమిస్ట్‌. భారతదేశపు శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం సాధించుకున్నారు.

దేవితా సాధించిన లక్ష్యాల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు. టెక్నాలజీ రంగంలో ముందు కళుతూ సాధించాల్సిన లక్ష్యాలకోసం శ్రమిస్తూ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. మన చుట్టూ ఉన్నవారు సలహలు అడిగితే ఎన్నైనా ఇస్తారు. కాని వారితో పోటీ అంటే మాత్రం సహించరు. అటువంటి వారితో డీల్‌ చేయడం పెద్ద సవాల్‌. వ్యాపారంలో లాభాలు, నష్టాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ విజయం వైపు సాగడం కత్తిమీద సాములాంటింది.

ఇది తెలిసిన దేవితా స్వతంత్రంగా బ్రతకడం అవసరమంటుంది. లాస్‌ఏంజిల్స్‌ సౌత్‌ కాలిఫోర్నియా యూని వర్సిటీ నుండి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన దేవితా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గేమ్‌ థియరీ ఆఫ్‌ స్ట్రాటెజిక్‌లో థింకింగ్‌ కోర్సు చేశారు. టెక్నికల్‌ ఫీల్డ్‌ అంటే దేవితాకు చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం. సొంతంగా అనేక పరికరాలు రూపొందించే వారు. చిన్నతనం లో ఇంట్లో ఉపయో గించే వస్తువుల గురించి తెలుసుకునేం దుకు ఆమె చూపిస్తున్న ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి ఆ రంగంవైపు వెళ్లేందుకు ఎంతో ప్రోత్సహించారు.

21 యేళ్లకు ట్రైనీగా జాయిన అయిన దేవితా మరుసటి యేడాదికల్లా డైరెక్టర్‌గా మారారని చెబుతారు. ఎప్పడూ కొత్త ఛాలెంజ్‌కోసం ఎదురు చూసే దేవితా ముంబైలో జరిగిన ఫస్ట్‌ – ఎవర్‌ వియు టిఇడిఎక్స్‌ గేట్‌వేకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

తన టీమ్‌లో మొత్తం అందరూ కష్టపడడం వల్లే ఇది సాధ్యమైందని చెబుతారు. జర్నలిస్టుగా దేవితా టెక్నాలజీకి సంబంధించి కొత్త కొత్త అంశాలను పరిచయం చేస్తుంటారు. అత్యాధునిక విధానాలను నేర్చుకుని పరిచం చేస్తూ ఉంటారు. ఏ చిన్న విషయమైనా ముందుగా తెలుసుకుని జర్నల్‌కు రాస్తారు. సొంతంగా తాను నడుపుతున్న కంపెనీ కోసం అన్ని విషయాలు తెలుసుకుంటా నంటారు. ఎప్పుడూ ఒకరితో పోల్చుకోవడం కన్నా పోటీతత్వాన్ని అలవరచుకోవడం మంచిందంటా రామె. అదే కొత్తగా ఏదైనా చేస్తే మనకు మనమే ప్రత్యేకంగా ఉంటాం. ఇతరులు మనల్ని చూసి నేర్చు కుంటారంటారు. ఇందుకు నేర్చుకోవాలనే తపన ఉండాలి. అది అందరికీ ఉపయోగపడాలి అంటారు దేవితా షరాఫ్‌.

Check Also

నెల్సన్‌ మండేలా కుమార్తె కన్నుమూత

Share this on WhatsAppజోహన్నెస్‌ బర్గ్‌, జూలై 13: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా కుమార్తె జిండ్జీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *