Breaking News
Home / National / అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో….

అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో….

ముంబై : అంబులెన్స్‌ రాక ఆలస్యమైన ఘటనలో మరాఠి నటిపూజా జంజర్‌(25) మృతిచెందారు. పూజతో పాటు అప్పుడే పుట్టిన ఆమె బిడ్డ కూడా కన్నుమూయడంతో విషాదం నెలకొంది. ప్రసవ తేదీ దగ్గరపడటంతో పూజ కుటుంబ సభ్యులు ఆమెను గోరెగావ్‌లోని ప్రాథమిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడంతో పాటుగా పూజకు తీవ్ర రక్తస్రావమైంది.

ఈ నేపథ్యంలో పూజను హింగోలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే అప్పటికే అర్ధరాత్రి దాటడంతో అంబులెన్స్‌ కోసం కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత చాలా సేపటికి ఓ ప్రైవేటు అంబులెన్స్‌ ఆసుపత్రికి రావడంతో పూజను అందులో హింగోలికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూజ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *