భారత క్రికెట్ నియంత్రణ (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నియామకం ఖాయం అయింది. అక్టోబర్ 23న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమా వేశంలో గంగూలీని అధ్యక్షునిగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంలో గంగూలీ ఇండియా-పాక్ క్రికెట్ సంబం ధాలపై చొరవ తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు గంగూలీ గురువారం విలేక రులతో మాట్లాడుతూ ఈ సమస్యకు పరిష్కారం ఇరు దేశాల ప్రధానుల అమోదంపై ఆధారపడి ఉందన్నాడు. ఆ విషయాన్ని వారే తెలియజేయాలన్నాడు. విలేకరులు గుచ్చిగుచ్చి అడుగగా, విదేశీ పర్యటనలకు ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి అని, అందువల్ల ఇండో-పాక్ క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు సంబంధించిన ప్రశ్నలను మోదీ, ఇమ్రాన్‌లను అడగాలని సూచించాడు. ఈ ప్రశ్నకు తమవద్ద సమాధానం లేదని, ప్రధానులే నిర్ణయం తీసుకోవాలన్నాడు.
ఇరు దేశాలమధ్య ద్వైపాక్షిక సిరీస్ చివరిసారిగా 2012లో జరిగింది. పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించిన ఆ సిరీస్‌లో రెండు టి20లు, మూడు వన్డేలు నిర్వహించారు. 1989లో చివరిసారి భారత జట్టు గంగూలీ నేతృత్వంలో పాకిస్తాన్ పర్యటించింది. 1989లో కార్గిల్ వార్, పుల్వామాలో తీవ్రవాదాల దాడులతో ఇరు దేశాలమధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తటస్థ వేదికలపై అంతర్జాతీయ టోర్నీలు మినహా ద్వైపాక్షిక సిరీస్‌లకు తెరపడింది. బోర్డు స్థానంలో పాకల మండలి(సీఓఏ) నియామకం తరువాత తీవ్రవాదానికి స్వస్తి చెపితేనే ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పునరుద్ధరణకు నోచుకోవని తేల్చిచెప్పింది. అంతేగాక ప్రపంచకప్‌నుంచి పాకిస్తాన్‌ను తొలగించాలనికూడా బీసీసీఐ ఐసీసీకి లేఖ రాసింది. అయితే ఇరు దేశాలమధ్య క్రీడా సంబంధాలు మెరుగుపరచుకోవాలని ఐసీసీ పలుమార్లు సూచించింది.
