కర్నూలు : ఉలిందకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని పుసులూరు-రేవడూరు గ్రామాల మధ్య ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. పుసులూరు గ్రామానికి చెందిన మాల మౌలాలి తన స్నేహితుడితో కలిసి వెల్దుర్తికి వెళ్లి తిరిగొస్తూ రేమడూరు-పుసులూరు మధ్య మూత్ర విసర్జనకు నిలిచారు. మౌలాలి మూత్ర విసర్జన చేస్తుండగా రేమడూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాగంటయ్య పాత కక్షలు మనసులో పెట్టుకుని ఆటోతో ఢీకొట్టాడు. అతను ఎగిరి కిందపడ్డాడు. పక్కనే ఉన్న మౌలాలి స్నేహితుడు ఆటోను కొద్దిదూరం వెంబడించాడు. అయితే.. అతను దొరకలేదు. గాయపడిన మౌలాలిని కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
